జీవితమంటే ఎంతటివారయినా అడ్జస్టయి బ్రతకాల్సిందే.కొంతమంది తక్కువా ,మరికొంతమంది ఎక్కువా ఎడ్జస్టవ్వాల్సింవుంటుంది . అంతే తేడా. జీవితంలో ప్రతి సందర్భంలో మనని బందించేవీ వుంటాయి.తరింపజేసేవీ వుంటాయి.కానీ ఆ సందర్బం మాత్రం మన చేతిలో వుండదు అది జీవితం. అదే జీవితం.
గౌరవం
మనం జీవితాన్ని శాసించకండా నడిచినంత కాలం సుఖంగానే బాతకవచ్చు.మనం విధిని ఎదిరించి,జీవన గతిని మనకు అనుకూలంగా మార్చాలని ప్రయత్నించినప్పుడు, భగవంతుని చేతి పగ్గాలను మన చేతిలోనికి తీసుకున్నప్పుడు కష్టాలు ప్రారంభమౌతాయి..కనుక జీవితం పట్ల గౌరవంతో మనం మసలుకోవాలి.మనం జీవితాన్ని శాసించయత్నించకూడదు.జీవితంలో వచ్చే మలుపుల్ని మనం గౌరవించి ఆమోదించాలి.
మనసు
మైండ్ అనేది మనిషికి సేవకునిగా కాక,యజమానిగా మారి,అతదిని రకరకాల ప్రలోభాల వైపు ఎగదోస్తున్న తరుణంలో మనిషికి కావలసింది హృదయభాష. ఇరవై ఒకటవ శతాబ్దం నిన్ను చేస్తున్న డిమాండు ఒక్కటే.ప్రతిక్షణం నిన్ను నువ్వు తెలుసుకుతీరాలి.అంతర్వీక్షణ మాత్రమే ఇకపై నీ ప్రాణవాయవు మనిషి రైలులా ఉండాలి.దేనికది కంపార్టుమెంటులా విభజించుకుంటూ పోవాలి . మనసుకు పెయిన్ కిల్లర్ అనేదే ఉంటే నిశ్చయంగా అది సంత్రుప్తే.

సార్థకం
మంచి చెడులు కెరటం తప్పనిసరిగా వెనక్కి వచ్చినట్లే , మన మంచి చెడులు మనవైపుకే తిరిగి వస్తాయి.మన సొంతం కోసం మనం చేసుకునేదంతా నీటి మీద రాసిన రాతలా మనతోనే అంతరించి పోతుంది.ఇతరుల మేలు కోసం చేసిందంతా రాతిమీద చెక్కిన శిల్పంలా శాశ్వతంగా నిలుస్తుంది. మనకున్న దానితో మనం జీవిస్తాం.ఇతరులకు ఇచ్చే దాంతో జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. ఇదే శాశ్వత సత్యం.పరమార్థం.