SHOP   
languages languagesicone
site loader
July 26, 2020 Aata    ఆట

Aata ఆట

        ఆట  – ఆడు

                      ఆట అనగానే  ఆనందం.ప్రతివారి మొహంలోనూ సంతోషం . మనకు తెలిసిన ఆటలు కొన్నే . తెలీని ఆటలు బోలెడున్నాయి . అన్ని ఆటలూ ఒకటి కాదు .అలాగే అన్నిటి అర్థం , పరమార్థం ఒకటేకాదు . ఈ వ్యాసంలో  ఆటలకు సంబంధించిన వివరాలుంటాయని మీరు భావిస్తే పప్పులో కాలేసినట్లే . ఆడే ఆట కాదిది . ఆలోచించే ఆట . మొదలెడదామా.

                 శంకరనారాయణ నిఘంటువులో ఆట అనే పదానికి  play , sport , game , dance , joke , gambling   ఇలా ఎన్నో అర్థాలున్నాయి .ఇవన్నీ మనకు పరిచయమైనవే. అయితే కొన్నిసార్లు పరిచయమైన పదాలైనా కాస్త లోతుగా ఆలోచిస్తే ,కొత్త గా కనిపిస్తాయి . కొత్త అందాలు కనిపిస్తాయి .

                 ఒక్కసారి గతంలోకి వెళ్తే ధర్మరాజు జూదమాడాడు . సారంగధరుడు పావురాల తో ఆడాడు . బాలచంద్రుడు పల్నాటి చరిత్రలో బొంగరాలతో ఆడాడు .ఇవి మనకు తెలిసిన ఆటలే . మరి క్రింది సందర్భాలను ఓ సారి గమనించండి .మొదటి ఆట సినిమాకు టికెట్లు దొరకలేదు అంటే  show  అని అర్థం .ఆ అమ్మాయి గజ్జె కట్టి ఆడిందంటే అబ్బో ! ,  అంటే నాట్యం అన్నమాట .వెనకటికి ఆటపాటలు అని పిల్లలకోసం ఒక మాసపత్రిక వచ్చేది .ఆటతోటలు అంటే  Guest house అని అర్థం నీ ఆట కట్టిస్తాను అంటే  నీ పనైపోయిందని భావం . ఆటవిడుపు రోజులు అంటే అనధ్యయనపురోజులు .అంటే ఆ రోజుల్లో పిల్లలు చదవక్కరలేదు.

                           చదరంగంలో నీ ఆటకట్టిందంటే  నువ్వోడావనిఅర్థం . ఆట పట్టించడం అంటే హేళన చేయడం . అంటే నేటి ర్యాగింగ్ లాంటిది .ఆటల్లో అరటి పండు అనేది తెలుగులో బాగా ప్రసిధ్ధి లో వున్న జాతీయం .ఆడేటప్పుడు దెబ్బలు తగిలితే తేలికగా తీసుకొని మరిచి పోవాలని అర్ధం .

నీ ఆటలు సాగనివ్వనని అంటే హెచ్చరిక .ఆటరాక మద్దెల ఓడని అంటే నైపుణ్యం లేని వాడని అర్ధం .

నేనంటే ఆటగా వుందంటే  నన్ను చిన్నచూపు చూస్తున్నావని .

ఇలాఆటలు బోలెడన్ని రకాలు .ఆటతో ఎన్ని ఆటలాడినా ఫరవాలేదు కానీ మాటలు జారకండి . మనుషులు దూరమౌతారు . 

Jeevitam-Life

జీవితమంటే ఎంతటివారయినా అడ్జస్టయి బ్రతకాల్సిందే.కొంతమంది తక్కువా ,మరికొంతమంది ఎక్కువా ఎడ్జస్టవ్వాల్సింవుంటుంది . అంతే తేడా. జీవితంలో ప్రతి సందర్భంలో మనని బందించేవీ వుంటాయి.తరింపజేసేవీ వుంటాయి.కానీ ఆ సందర్బం మాత్రం మన చేతిలో వుండదు అది జీవితం. అదే జీవితం.

గౌరవం

మనం జీవితాన్ని శాసించకండా నడిచినంత కాలం సుఖంగానే బాతకవచ్చు.మనం విధిని ఎదిరించి,జీవన గతిని మనకు అనుకూలంగా మార్చాలని ప్రయత్నించినప్పుడు, భగవంతుని చేతి పగ్గాలను మన చేతిలోనికి తీసుకున్నప్పుడు కష్టాలు ప్రారంభమౌతాయి..కనుక జీవితం పట్ల గౌరవంతో మనం మసలుకోవాలి.మనం జీవితాన్ని శాసించయత్నించకూడదు.జీవితంలో వచ్చే మలుపుల్ని మనం గౌరవించి ఆమోదించాలి.

మనసు

మైండ్ అనేది మనిషికి సేవకునిగా కాక,యజమానిగా మారి,అతదిని రకరకాల ప్రలోభాల వైపు ఎగదోస్తున్న తరుణంలో మనిషికి కావలసింది హృదయభాష. ఇరవై ఒకటవ శతాబ్దం నిన్ను చేస్తున్న డిమాండు ఒక్కటే.ప్రతిక్షణం నిన్ను నువ్వు తెలుసుకుతీరాలి.అంతర్వీక్షణ మాత్రమే ఇకపై నీ ప్రాణవాయవు మనిషి రైలులా ఉండాలి.దేనికది కంపార్టుమెంటులా విభజించుకుంటూ పోవాలి . మనసుకు పెయిన్ కిల్లర్ అనేదే ఉంటే నిశ్చయంగా అది సంత్రుప్తే.