తెలుగు ఆడియో నావెల్స్ .కామ్
తెలుగు ఆడియో నావెల్స్ .కామ్ వారు సమర్పించు సాహిత్య శబ్ద ప్రపంచానికి మీకిదే మా స్వాగతం.
ఆధునిక యుగంలోని ఆటుపాట్లను తట్టుకుని,మున్ముందుకు సాగుతున్న నవయువ లోకానికి మా శుభాకాంక్షలు. పరిమిత విరామాలతో,అపరిమిత ఒత్తిళ్లతో జీవిత గమనాన్ని సాగించే మా యువ బాటసారులకు మనోల్లాసం కలిగించాలనే సదుద్దేశంతో సరికొత్తగా శ్రవణ విధానంలో ఏరికూర్చిన ప్రసిధ్ధ రచయితల,రచయిత్రుల నవలలను మీ చెంతకు చేరుస్తున్నాం.తొలిదశలోఆధునికసాహిత్యాన్నీ,మలిదశలో ప్రాచీన సాహిత్యాన్నీ మీకందించాలన్నదే మా లక్ష్యం.
దాంతోబాటే మీకు ఆనందాన్నిచ్చే,మనసుకు ఆహ్లాదాన్ని పంచేలా స్వాతిముత్యాల్లాంటి కథలను కూడా మీకందిస్తున్నాం.కథ అనేది ఒక సన్నివేశం,ఒక పాత్ర ,ఒక మనస్థితి ఈ మూటిలో దేన్నైనా,అన్నైనా ఆధారంగా చేసుకుని వెలిగే రచనా ప్రక్రియ.
ప్రపంచంలో ప్రతిప్రాణికీ ఓ కథ ఉంది.అలాగే ప్రతికథకూ ఓ ముగింపు ఉంది.అది మనకు నచ్చాలనేం లేదు.కానీ నవల,నాటకంలో ఉండేంత విస్తృతీ,రసపోషణకు అవకాశం లేకున్నా చిన్నమెత్తు బంగారంతో చింతాకు పతకంచేసే నైపుణ్యాన్ని అలవోకగా సృష్టించగలిగే చేయి తిరిగిన కథకులున్నారు.వారి బాటలో నడుస్తూ కథకు కొత్త సింగారాల నద్దే యువనవ రచయితలున్నారు( రచయిత్రులుకూడా ).వారి సృజనశీలతకు నమస్కారాలర్పిస్తూ కొన్నకథలనూ అందిస్తున్నాం.
మన సాహిత్యపు సిరులను మీరు మేము కలిసి విని , ఆనందిద్దాం.మనస్సులను రసరంజనం చేసుకుందాం.మీ ప్రయాణాలలో అలసటనూ,విసుగునూ దూరం చేసి,మనసు మురిపించే మధురానుభూతిగామలచుకునే దిశలో మీ నేస్తం ఈ తెలుగు ఆడియో .కామ్.అంటే సుమధుర సబ్ద ప్రపంచం.వేటినుండి మీ సొంతం.ఈ నూత్న ప్రయత్నంలో మీ సలహాలు,సూచనలు మాకు శరోధార్యం.ఈ శ్రవణ శబ్ద ప్రపంచానికి మీకు మా సాదర గా స్వాగతం పలుకుతున్నాం.రండి—వినండి.వినిపించండి.
తెలుగు ఆడియో నావెల్స్.కామ్
ఓ సుమధుర సాహితీ శబ్ద ప్రపంచం
Teluguaudionovels is an endeavor to bring , thoughts, ideas, concepts , short stories and Novel Classics in Telugu literature to the current generation. The audio format provides a convenient medium for the current generation to listen learn on the go… the sweet honeyful flavours of ones own mother tongue.
The site also provides a platform for photographers and article writers to showcase their works.
Nanduri Balatripura Sundari says:
September 1, 2020 at 6:50 pm
Mudrayantra Avishkarta – Mitabhashi – “Gutten Burg” invention of Mudrana Yantra and his details so gracefully narrated by “Mithabhashi” is very very appreciable. Thank you very much.