SHOP   
languages languagesicone
site loader

పరీక్ష

జీవితంలోని ప్రతి అవకాశమూ కూడా నీవు ఎదిగేందుకు తోడ్పడుతుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా నీవు ఎదుగుతావో లేదో తెలుసుకునే పరీక్ష వంటిది.

అసామాన్యుడు

ఛాలెంజ్ , అవమానం ఈ రెండూమనిషిని రెచ్చగొడతాయి. వాటిని విని కుమిలి పోయేవాడు సామాన్యుడు. ఖండించేవాడు మధ్యముడు, చేసి చూపేవాడు అసామాన్యుడు.

ఎదుగుదల

జీవితంలో అన్నీ అనుభవాలనుండే తెలుసుకోవాలంటే సమయం సరిపోదు. విచక్షణ, విమర్శన , అవగాహన ద్వారా మనం ఎదగాల్సి వుంటుంది.

పరాజయం

విజయం కేవలం ఓ అనుభూతి. పరాజయం గొప్ప అనుభవం. సక్సెస్ లో నేర్చుకోడానికి ఏదీ వుండదు.ఫెయిల్యూర్ మాత్రం అనుభవాల పాఠశాల.పరాజయం మనిషిని శిల్పంలా చెక్కుతుంది.

 నువ్వు

నువ్వేది తింటావో అదే నీ శరీరం. నువ్వేమి ఆలోచిస్తావో అదే నీ వ్యక్తిత్వం.

పడవ

ప్రపంచం అనే సముద్రంలో సాగిపోతున్న పడవలు మన జీవితాలు.పడవ నీటిలో ఉండాలి గానీ , పడవలో నీరుండరాదు.

పరఫార్మర్

ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అనుకునే వాడు వాచర్ . ఇంతకన్నా బాగా ఉండడం ఎలా అని ఆలోచించేవాడు పర్ఫార్మర్

గమ్యం

నీ గమ్యంలో స్పష్టత ముఖ్యం. నీ అభిరుచులకి అనుగుణంగా గమ్యం ఏర్పరచుకోకు. నీ గమ్యానికి అనుగుణంగా అభిరుచులు ఏర్పరచుకో.

మీ జీవితం

మీ బాగుకోసం, ఉన్నతి కోసం ముందు ఆలోచించాల్సింది మీరే. ఇతరులు కేవలం ప్రేక్షకులు.వాళ్ల ముందు మీ విలువైన జీవితాన్ని ఉంచి వినోదప్రాయం కావద్దు.

గురువు

నిన్ను నువ్వు మలచుకునే క్రమంలో శత్రువు కొట్టే ప్రతి దెబ్బా నిన్ను రాటుదేలుస్తుంది. శత్రువే సరైన గుణపాఠం నేర్పే గురువు.

Leave a Reply

Your email address will not be published.