శాశ్వతం
మన సొంతం కోసం మనంచేసుకున్నదంతా నీటిమీద రాసిన రాతలా మన తోనే అంతరించిపోతుంది. ఇతరుల మేలు కోసం చేసిందంతా రాతి మీద చెక్కిన శిల్పంలా శాశ్వతంగా నిలుస్తుంది.
విజయం
విషయ సేకరణలోను ,విశ్లేషణలోను విచక్షణ లోను ప్రయత్న పూర్వకంగా ఆశా వాదాన్ని చొప్పిస్తే ఆత్మవిశ్వాసం వృధ్ది చెందుతుంది. పర్యవసానంగా విజయావకాశాలు మెరుగవుతాయి.
అవకాశం
అవకాశం వేర్వేరు రూపాలతో మీ తలుపు తడుతుంది. కానీ చాలామంది వాటిని గుర్తించక వదిలేసుకుంటారు .ప్రతి సమస్యా ,ప్ర తి కష్టమూ …ఇవన్నీ దుఃఖమనే ముసుగులో దాక్కుని ఎదురుపడే అవకాశాలే.
భయం
ముడి బంగారం విపరీతమైన వేడిమిని ఎదుర్కుంటే గానీ , మేలిమి బంగారం కాలేదు. ముడి వజ్రాలను కొట్టి, చెక్కి మెరుగుపెడితేగానీ, విలువను సంతరించుకోలేవు.అలాగే భయాలను ఎదుర్కొంటేనే గానీ ధైర్యవంతులము కాలేము.
జీవితం
జీవితంలో మనమెన్నడూ ఒకటే చోట వుండేందుకు ప్రయత్నిస్తుంటాము .కానీ జీవితం మనను ముందుకు తీసుకుపోయి,కొత్తపాఠాలను నేర్పాలని ప్రయత్నిస్తూ వుంటుంది.
వేళ్లు
మన ఐదువేళ్లని చూసి పాఠం నేర్చుకోండి.ఆ ఐదు ఒకే షేపులో లేవు. కానీ అన్నీ జీవించి నంతవరకు కలిసే వుంటాయి.అలాగే పరస్పరం సహకరించుకుంటూ వుంటాయి.
ఓటమి
ఓడిపోవడం ఓటమి కాదు.పోటీ నుండి శాశ్వతంగా విరమించుకున్నప్పుడే ఓటమి అవుతుంది.
అంచనా
మీరు కార్యసాధకులా కాదా అనే విషయాన్ని మిమ్మల్ని అడిగి ఎవరూ తెలుసుకోలేరు. మీరు సాధించినవిజయాలని అనుసరించి, మిమ్మల్ని అంచనా వేస్తారు.
కోపం
మన శత్రువు మనకు చేసిన మొదటి అపకారాన్ని జీర్ణించుకోలేక మనకి మనం చేసుకునే మరో అపకారం పేరే కోపం.
తేడా
మంచి చదరంగం టగాడు అవతలి వ్యక్తి చివరి ఎత్తువరకూ ఊహించగలిగి వుంటాడు.సామాన్యుడు తరువాతి ఎత్తు గురించే తాపత్రయపడతాడు.అంతే తేడా.