SHOP   
languages languagesicone
site loader
October 14, 2020 ముత్యాలపందిరి   04

పాఠాలు

ఫెయిల్యూర్ నేర్పినన్ని గుణపాఠాలను సక్సెస్ ఎప్పుడూ నేర్పలేదు.పరాజయం జాగ్రత్తను నేర్పితే,విజయం భయాన్ని నేర్పుతుంది.

కాలం

తేడా కాలంలో లేదు.దాన్ని అర్థం చేసుకునే మనుషుల్లో వుంది. అనవసరపు జ్ఞాపకాలని వదిలించుకుంటే చాలా సమయాన్ని మిగుల్చుకున్నట్లే.

వివేకి

ప్రపంచపోకడకు అనుగుణంగా తనని తాను డిజైన్ చేసుకునేవాడు వివేకి. తన అభిప్రాయాలకి అనుగుణంగా  ప్రపంచం మారాలని , మార్చాలని పట్టుబట్టే వాడు మూర్ఖుడు.

లక్షణం

సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు, అపజయాలను మర్చిపోవడం విజేత లక్షణం.

ప్రాణం

మన జీవితాలకు సంవత్సరాలను  జత చేయడం కాదు.జీవించే సంవత్సరాలకు ప్రాణం పోయాలి.

సంతృప్తి

సంతృప్తి లేకపోతే మనశ్శాంతి వుండదు.అదే విధంగా అసంతృప్తి లేకపోతే మన ప్రగతి శూన్యమై పోతుంది.

డెడ్ లైన్

డెడ్ లైన్ లేని లక్ష్యం కేవలం ఒక పగటి కల వంటిది.

సక్సెస్

సక్సెస్ అవ్వాలని ఏ వ్యక్తీ మీకు చెప్పరు.మీ అంతట మీరే నిర్ణయించుకుని కృషి చేయాలి. శ్రమించాలి. సాధించాలి.అంతేకాని మీ సక్సెస్ కోసం వేరేవాళ్లు కృషి చేయరు.

కష్టాలు

కష్టాలు వాషింగ్ మిషన్ లాంటివి. మనల్ని తిప్పి తిప్పి కొట్టి ఉతికి ఆరేస్తాయి. కానీ చివరికి మరింత శుభ్రంగా , స్వఛ్చంగా తయారు చేసి, బయటి భవిష్యత్తులోకి పంపిస్తాయి.

విజయం

ఎక్కడ కోరిక టుందో , అక్కడొక ఆలోచన వుంటుంది. ఎక్కడ సంకల్పం వుంటుందో , అక్కడ ఆ  ఆలోచన ఒక విజయంగా మారుతుంది. కోరిక లేని మనిషికి విజయం లేదు.

Leave a Reply

Your email address will not be published.