SHOP   
languages languagesicone
site loader

ఎదుగుదల

పరాజయాలూ , అనుభవాలూ శత్రువులూ ,అవకాశాలూ …. ఈ నాలుగే ప్రతిమనిషీ ఎదుగుదలకు మూలస్థంభాలు.

వ్యక్తిత్వం

పొదుపుగా , సూటిగా తక్కువ మాటలతో చెప్పే విషయానికున్న శక్తి అపారం. దాన్ని సాధించడమే  సిసలైన వ్యక్తిత్వం.

జీవితం

నిన్నకూ,రేపటికీ మధ్య బిగించిన  తాడులాంటిది జీవితం.దీనిపై నడక ఎప్పుడూ విన్యాసమే. మనసు వేగం తగ్గినప్పుడే అడుగు సవ్యంగా పడుతుంది. అందుకే దాన్ని ఎప్పుడూ వర్తమానం లోనే వుంచాలి.

కష్టాలు

కష్టాలు లేకుండా మనిషి ఎదగలేడు.వర్తమానం అనే రెక్కలతో జ్ఞాపకాలనూ,గతాన్ని వెనక్కి తోస్తూ ఉంటేనే ముందుకు పోగలం.

ముఖ్యం

ప్రతిపదమూ అర్థం అనే వస్త్రాన్ని కప్పుకొని వుంటుంది. జీవితంలో కమ్యూనికేషన్ , ఎక్స్ ప్రెషన్ రెండూ ముఖ్యమే.

కల

కల అనేది కరెంట్ లాంటిది .దాని వెలుగులో జీవితం వికసించాలి తప్ప షాక్ కొట్టి చంపేయకూడదు.

వంతెన

కాలంతో బాటు అప్ డేట్ కాకపోవడమే నేటి తరం దృష్టిలో నిజమైన వృధ్దాప్యం. అందుకే నిన్నటి జ్ఞాపకాలకీ, నేటి జ్ఞానానికీ మధ్య సంయమనం అనే వంతెన కావాలి.

సముద్రం

సముద్రం బహుభాషా వేత్త.సముద్రం గొప్ప మూడ్ ఎలివేటర్. ప్రతి కెరటం మనకి పోరాటాన్ని నేర్పుతుంది.

కామన్ సెన్స్

నిన్ను నువ్వు తెలుసుకోవడానికి కావలసింది కామన్ సెన్స్.నీ చుట్టూ ఏముందో చెప్పేది ఇంటలిజెన్స్.

తెలివి

జ్ఞాపకం అనేది బయటినుంచి వచ్చి మనసులో నమోదు అయ్యే సమాచారం. తెలివి అనేది మీ లోలోపల నుంచి పెల్లుబికే శక్తి.

భావం

పాజిటివ్ గా లోచించడం అనేది ఇన్సిపిరేషన్.  ఆలోచనను తక్షణం అమలులో పెట్టి, ఆచరించడం మోటివేషన్.యద్భావం తధ్బవతి  అన్న మాటకు లోతైన అర్థం ఇదే.

Leave a Reply

Your email address will not be published.