ప్రయత్నం 15.08.2020
ప్రయత్నం ద్వారా పనులు సాధ్యపడుతాయే తప్ప కేవలం మనసులో అనుకుంటే చాలదు. నిద్రిస్తున్న సింహం నోటిలోకి అప్రయత్నంగా ఆహారం చేరదు కదా!
ఫలితం
ఎల్లప్పుడూ పాతబడిపోయిన విధానాలను అవలంబిస్తుంటే పాతఫలితమే వస్తుంది. మీరు శ్రమించడమే కాదు, కౌశలంగా పనిచేయడం కూడా నేర్చుకోవాలి.
దృక్పథం
మన ఆలోచనల మీదనే మన జీవిత గమనం ఆధారపడి వుంది. జీవితంలో మనకు విజయాన్నిగానీ,పరాజయాన్నిగానీ తెచ్చేది మన మనో దృక్పథం మాత్రమే.
నక్షత్రం
మంచి మిత్రులు నక్షత్రాలలాంటి వారు. వారు అస్తమానూ మనకి కనిపించకపోయినా, వారున్నారనే ధైర్యం మనల్నెపుడూ వెన్నంటే వుంటుంది.
పట్టుదల
ప్రపంచంలోప్రతీదీ సాధారణ ప్రజ్ఞతోనూ, అపారమైన పట్టుదల తోటీ సాధ్యపడుతాయి.
సాఫల్యం
ఏ మనిషీ ఆశించినవన్నీ తన జీవితకాలంలో సాధించలేడు. ఆశించినవన్నీ స్వప్నాలై కరిగిపోకుండా , కొన్ని కలలైనా నిజాలు చేసుకోగలిగితే, జీవితానికి సాఫల్యం వుంటుంది.
ఆనందం
మనస్సును అదుపులో ఉంచుకుని, చేసే ప్రతిపని, ఆడే ప్రతిమాట నిజాయితీగా వుంటే మన జీవితాలు ఆనందమయమౌతాయి.
భయం
భయాల వల్ల పాఠాలు నేర్చుకోకపోతే, మనలోభయాన్ని రేకెత్తించే ఆ స్థితులు , ఆ పాఠం నేర్చుకునేదాకా . మళ్లీ మళ్లీ జీవితంలోకి వస్తూనే వుంటాయి. ప్రతి సమస్యా తనతో పాటే పాఠం అనే కానుకను తీసుకువస్తుంది.
ప్రశంస
ఇతరులను ప్రశంసించడంలో పిసినారితనం చూపకండి. పొగిడేందుకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి. ప్రశంసించడంలో ముందూ , లోపాలను ఎన్నడంలో ఆఖరుగా వుండండి.