SHOP   
languages languagesicone
site loader
October 14, 2020 గణిత  బ్రహ్మ

                         గణితబ్రహ్మ అంటే లక్కోజు సంజీవరాయశర్మ గారు .ఈయన నవంబర్ 17 , 1907 లో కడపజిల్లా ప్రొద్దుటూరు మండలం లో కల్లూరు అనే గారామంలో జన్మించారు.1998 లో శ్రీ కాళహస్తి లో మరణించారు. జన్మతోనే అంథుడు.ఎన్నో గణితావధానాలు చేసి,ఎందరినో ఆశ్చర్యపరిచారు.లక్కోజు పెద్దపుల్లయ్య,నాగమ్మ తల్లిదండ్రులు.ప్రాథమిక విద్యకు కూడా నోచుకోలేదు.19 ఏళ్ల వయస్సులో ఆదిలక్ష్మమ్మను వివాహమాడారు.

                            సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సమక్షంలో నంద్యాలలో ఆంధ్ర మహాసభ హాలులో 1928లో తొలిప్రదర్శన ఇచ్చారు.జవహర్ లాల్ నెహ్రూ గారి పిలుపు మేరకు నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ,ఇతర ప్రముఖుల సమక్షంలో ఢిల్లీలో  ప్రదర్శననిచ్చారు.ఆంధ్ర ప్రదేశ్ ,తమిళనాడు,కర్ణాటక,మహారాష్ట్ర,ఢిల్లీలలో విస్తృతంగా పర్యటించి దాదాపు 7000 ప్రదర్శనలిచ్చారు.

                     1966, డిసెంబర్ 7 నాడు  హైదరాబాద్ లో శ్రీ కృష్ణదేవరాయంధ్ర భాషా నిలయంలో మరిచిపోలేని ప్రదర్శన నిచ్చి ,సభ్యులను ఆనందాశ్చర్యాలకు గురిచేసారు. ఎన్నో బంగారు పతకాలను,సన్మానాలు , సత్కారాలు అందుకున్నారు.అంతేకాదు .మరో ఆశ్చర్యకరమైన విషయం 4000 సంవత్సరాలకు ఉపయోగించే క్యాలండర్ తయారు చేసారు.

                  1993లో అమెరికాకు వెళ్ళవలసి ఉండింది.కానీ వీసా సమస్యలవల్ల అది సాధ్యం కాలేదు. 1996లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్  డిగ్రీని అందుకున్నారు.

                చివరి రోజులలోశ్రీ కాళహస్తి దేవాలయంలో వయొలిన్ వాయిస్తూ ,దేవస్థానం వారిచ్చే గౌరవవేతనంతో కాలం గడిపారు. ఒక గణితావధాని,అపూర్వ మేథా సంపద కలిగిన వ్యక్తి  బీదరికంలో ఒక చిన్నరేకులషెడ్డులో గడిపారంటే  చాలా బాథ కలుగుతుంది.అయినా ఏనాడూ ఆయన మొహంలో ప్రశాంతత చెక్కుచెదరలేదు. ఈ వ్యాసకర్తకు వారికి నమస్కరించే అదృష్టం కలిగింది.అదో మథురస్మృతి.

Leave a Reply

Your email address will not be published.