SHOP   
languages languagesicone
site loader

తుషారం

వాతావరణంలో అల్ప ఉష్ణోగ్రతలున్నప్పుడు గాలిలో నీటి ఆవిరి భూమిపై చల్లని వాటిపై చినచిన్న నీటిబిందువుల వలె చేరుతుంది.దీన్నే తుషారం అంటారు.

తలత్రం

చేతికి దెబ్బతగులకుండా ధరించే చర్మపుతొడుగు.

రింగారింగా రోజెస్

ఈ రైమ్ కు సంబంధించిన చిన్నకథ.ఒకసారి ఇంగ్లాండ్ లో ప్లేగ్ వ్యాది ప్రబలినప్పుడు పుట్టిన పద్యమిది.కళ్లచుట్టూ నల్లని వలయాలు ఏర్పడడం దాని లక్షణం.ఆ ప్రాంతంలో పోజీ అనే పువ్వులను పెట్టుకుంటే ఆ వ్యాధి తగ్గుతుందని నమ్మేవారు.ఆల్ ఫాల్ డౌన్ అంటే అర్థం చెప్పనవసరం లేదు.

చాంద్రాయణ వ్రతం

శుధ్ద పాడ్యమి ( చాంద్రమానంలో నెలలో మొదటిరోజు) ఒక చేతి కబళం ( ముద్ద) తినాలి.రెండో రోజు రెండు కబళాలు.అలా దినానికొక్కటి చొప్పున హెచ్చిస్తూ,పౌర్ణమి నాడు 15 కబళాలు తినాలి.బహుళ పాడ్యమి నుండి రోజుకు ఒకటి చొప్పునతగ్గిస్తూఅమావాస్య నాడు ఉపవాసం వుండాలి.ఆ వ్రతం మహాపాపాలకు ప్రాయశ్చిత్తంగా చెప్పబడింది.

గోత్రం  _  ప్రవర

వంశపు మూలపురుషుని పేరుతో గోత్రం ఏర్పడుతుంది.ఆ ఋషి వంశీయులు ఆ ఋషి గోత్రీయులు అవుతారు.వంశం లోని ముఖ్యఋషుల పేర్లు చెప్పుకోవడమే ప్రవర అవుతుంది.

భోగిపళ్లు

సంస్కృతంలో రేగిపండుని అర్కఫలం అంటారు.అర్క అంటే సూర్యుడు.ఆకారంలోరేగిపండు సూర్యుని పోలి వుంటుంది.ఆ పళ్లని తల మీంచి పోస్తుంటే అవి పిల్లల శరీరం మీదుగా జారి,నేలపై పడుతాయి.ఆ సూర్యశక్తి ఈ బిడ్డ శరీరం నిండుగా ప్రసరించుగాక అని పెద్దలు దీవించడం,కోరుకోవడం దీని అంతరార్థం.

Leave a Reply

Your email address will not be published.