SHOP   
languages languagesicone
site loader

నిత్యజీవితంలో ఎన్నో పదాలను అలవోకగా వాడేస్తుంటాం. వాటి అసలర్థం తెలిస్తే ఆశ్చర్యపడుతుంటాము.అలాంటి వాటిని కొన్నింటిని ఈ శీర్షికలో తెలుసుకుందాము.తెలిస్తే మరోసారి గుర్తు చేసుకుందాం.

 గురుదక్షిణ

ఉపదేశ సమయంలో  5 వస్తువులను గురువుకు సమర్పించుకోవాలి.సింబాలిక్ గా కొబ్బరికాయ,పళ్లు,పూలు,అగరువత్తులు,నైవేద్యం ఇస్తారు.

దానధర్మాలు

దేశకాల పాత్రలను చూసి యోగ్యులైన వారికి అర్పించేది దానము.దీనులకు దయతో ఇచ్చేది ధర్మము.

యోగక్షేమాలు

యోగం అంటే లేని దాన్ని సంపాదించు కోవడం.క్షేమం అంటే ఉన్నదానిని కాపాడుకోవడం.ఈ రెండూ కలిపి,మంగళాన్ని,రక్షణను కోరుకోవడం భద్రం.

 భోజన సమయాలు

మధ్యాహ్నం 11 నుండి 12 మధ్యలో చేసిన  ఉత్తమం

మధ్యాహ్నం 12 నుండి 1 మధ్యలో చేసిన మధ్యమం,       ఆ తరువాత అధమం

కుశలం

కుశలు అంటే దర్భలు.ముట్టుకుంటే చాలు చెయ్యితెగేంత షార్పుగా వుంటాయి.చెయ్యి తెగకుండా కుశలు కోసినట్లు మన కార్యాలన్నింటిని నిర్వర్తించుకోవడమే కౌశలం.

గ్రామం

17 మెయిన్ రోడ్లుంటే దాన్ని పురమంటారు.అదే 9 మెయిన్ రోడ్లుంటే అది గ్రామం.

రేవు

రేవు అంటే నదిని దాటడానికి అనువైన స్థలం.

బట్టలుతికేది చాకిరేవు.

కాలవ దాటేది బళ్లరేవు.

సముద్రతీరం ఓడరేవు.

తాయెత్తు

ఇది టావీజ్ అనే అరబిక్ మాట. మహమ్మదీయుల ఖురాన్ మంత్రాలు రాసిన తాయెత్తులు మెడకు,ముంజేతికి ఒకప్పుడు కట్టుకునేవారు.

Leave a Reply

Your email address will not be published.