పొలికేక
కళ్లం చుట్టూగాని,రాసి చుట్టూగాని పొలి తిరుగుతూ బిగ్గరగా పాడే పాటలు.
అర్థశాస్త్రం
1905 లో డాక్టరు శ్యామశాస్త్రిచే తంజావూరు సరస్వతీ మహల్ లో కౌటిల్యుడు రాసిన అర్థ శాస్త్రం కనుగొనబడింది.
నగరాలు
క్రీ .పూ 326 లో అలెగ్జాండర్ దండయాత్ర జరిపేనాటికి , మన దేశంలో 1500 నగరాలున్నాయని గ్రీకు రచయిత స్ట్రాబో రాసాడు.
బౌధ్ద సంస్కృతి
నలందా , తక్షశిల , అమరావతి , నాగార్జున కొండ మొదలైన ప్రాచీన విద్యాకేంద్రాలన్నీ బౌధ్ధ సంస్కృతి ఫలితాలే.
తాజ్ మహల్
తాజ్ మహల్ 20 వేలమంది 22 సంవత్సరాలపాటు శ్రమించి , నిర్మించిన అధ్భుత కట్టడం.ఆ రోజుల్లోనే దీన్ని కట్టడానికి నాలుగు కోట్ల , ఇరవై లక్షలు ఖర్చయిందట.
వాస్కోడిగామా సమాధి కేరళలోని ఎర్నాకుళం లో ఉంది.
గుంటూరు జిల్లాలోని చేబ్రోలులోని చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం దేశం లోని అత్యంత అరుదైన ఆలయం.